మార్చి రిలీజ్‌లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?

Published on Sat, 01/17/2026 - 23:34

సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్‌లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్‌లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది.  

పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్‌స్టాప్‌గా షూట్ చేసినా, రిలీజ్‌కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్‌ చేసిన రామ్‌ చరణ్‌ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్‌ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్‌కు పెద్ది రిలీజ్‌ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్‌లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది.  

దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్‌లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్‌ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్‌లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్‌లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో భారీ సినిమాలతో హాట్‌గా మారనుంది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)