Breaking News

చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?

Published on Tue, 01/06/2026 - 19:13

మెగాస్టార్‌ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా  ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్‌ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.  

మనశంకర్‌ వరప్రసాద్‌ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది.  అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్‌ అభిమానులతోనూ వీడియో కాల్స్‌లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. 

(చదవండి: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)

దీంతో మెగా ఫ్యాన్స్‌ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్‌ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్‌లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

(చదవండి: ‘ది రాజాసాబ్‌’ నుంచి ఆ రెండు సీన్లు కట్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?)

మనశంకర్‌ వరప్రసాద్‌(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న  ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు