Breaking News

అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య

Published on Tue, 07/16/2024 - 12:34

కోలీవుడ్‌లో హీరో సూర్యకు భారీగానే అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టినరోజు వస్తుదంటే చాలు వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ క్రెడిట్‌ను సూర్యకు ఇచ్చేస్తారు. తమిళనాడులో ఏమైన విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా కట్టకట్టుకుని నిలబడతారు. కోలీవుడ్‌లో సూర్యకు ఎంత గుర్తింపు ఉందో ఆయన అభిమానులకు కూడా సామన్యప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జులై 23న సూర్య పుట్టినరోజు రానుంది. ఈ క్రమంలో వారు పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చారు.

సూర్య పుట్టినరోజు సందర్భంగా గతేడాది 2000 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సూర్య చలించిపోయారు. అప్పుడు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని అభిమానులకు సూర్య మాటిచ్చారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా చెన్నైలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అభిమానులతో పాటుగా సూర్య కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు సుమారు 500 మందికి పైగా అభిమానులు బ్లడ్‌ డొనేట్‌ చేశారు. ఈ కార్యక్రమం మరో పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతామని ఆయన ఫ్యాన్స్‌ తెలిపారు.

సుమారు ఏడేళ్ల క్రితం హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ...చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో   జన్మించిన పిల్లలకు బంగారపు ఉంగరాలను అందించారు. అప్పట్లోనే అన్నదానాలు, రక్తదానాలతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. అలా ఆయన అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. గత ఏడాది డిసెంబర్‌ నెలలో తమిళనాడును మిచాంగ్‌ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా ఫ్యాన్స్‌ నిలిచారు. పరిస్థితులు చక్కపడ్డాక వారందరినీ భోజనానికి సూర్య ఆహ్వానించారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగ గడిపారు. వాటికి సంబంధించిన ఫోటోలు  నెట్టింట అప్పట్లో తెగ వైరల్‌ అయ్యాయి.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)