Breaking News

సూర్య- ఆర్‌జే బాలాజీ కొత్త సినిమా టైటిల్‌ ఫిక్స్‌

Published on Fri, 06/20/2025 - 10:45

హీరో సూర్య 45వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా టైటిల్‌ను మేకర్స్‌ రివీల్‌ చేశారు. గతేడాదిలో  పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్  ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. నటుడు ఆర్‌జే బాలాజీ ఈ మూవీకి  దర్శకత్వం వహించనున్నారు.  డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి త్రిష హీరోయిన్‌గా నటించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు.

సూర్య- ఆర్‌జే బాలాజీ ప్రాజెక్ట్‌కు 'కరుప్పు' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇదొక యాక్షన్‌ అడ్వెంచరస్‌ చిత్రమని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఏడాది చివరలో కరుప్పు విడుదల కావచ్చని సమాచారం. రేటియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆర్‌జే బాలాజీ మల్టీ టాలెంటెడ్‌ అని తెలిసిందే. ఆయన నటుడు, గాయకుడు మాత్రమే కాదు, దర్శకుడిగానూ  కొలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించారు. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ తెరకెక్కించి సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్‌తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు  హీరో సూర్యతోనే ఛాన్స్‌ దక్కించుకుని హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)