Breaking News

ఎట్టకేలకు టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన సూర్య!

Published on Fri, 08/25/2023 - 08:23

కోలీవుడ్‌ కథానాయకులు తెలుగు చిత్రాల్లో నటించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. నట దిగ్గజం శివాజీ గణేషన్‌ నుంచి తాజాగా ధనుష్‌ వరకు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అలరించిన వారే. ఇందులో నటుడు కార్తీ, విజయ్‌ వంటి వారు కూడా ఉన్నారు. ఐతే నటుడు సూర్య మాత్రం నేరుగా తెలుగు చిత్రాల్లో ఇంతవరకు నటించనేలేదు. కానీ ఈయన నటించిన పలు తమిళ చిత్రాలు ఇక్కడ అనువాదం అయ్యి విజయం సాధించాయి.

అయితే సూర్యను తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది త్వరలోనే జరగబోతుందనేది తాజా సమాచారం. ఇటీవల కార్తికేయ– 2 చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో సూర్య నటించడానికి సమ్మతించినట్లు ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను చెప్పిన సింగిల్‌ లైన్‌ స్టోరీ సూర్యకు నచ్చినట్లు పేర్కొన్నారు.

ఆయన తరచూ తనకు ఫోన్‌ చేసి కథ గురించి అడుగుతున్నారని చెప్పారు. తానిప్పుడు సూర్య కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సూర్య కమిట్‌ అయిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత తన దర్శకత్వంలో ఆయన నటిస్తారని పేర్కొన్నారు. కాగా ఈయన సూర్య కోసం సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇది కచ్చితంగా పాన్‌ ఇండియా చిత్రం అవుతుందని భావించవచ్చు. కాగా ప్రస్తుతం చందు మొండేటి నటుడు నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు.

చదవండి: National film awards 2023: జాతీయ అవార్డుల జాబితా ఇదే!

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)