Breaking News

సూర్య పనిమనుషుల చేతివాటం.. రూ.42 లక్షలు స్వాహా!

Published on Wed, 09/24/2025 - 10:13

తమిళ హీరో సూర్య (Suriya)కి భద్రతా అధికారిగా పని చేస్తున్న జార్జ్‌ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పని చేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్‌ జార్జ్‌కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా రూ.1 లక్ష ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్‌కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ.42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు. 

రూ.2 కోట్ల మేర మోసం
అప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్‌ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి రూ.2 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఈ నలుగురూ సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం! 

చదవండి: సంజనా హీరోయిన్‌ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై..

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)