Breaking News

200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్‌బస్టర్

Published on Tue, 08/04/2026 - 09:54

తమిళ హీరో సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేవారం థియేటర్లలోకి రానున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ మీడియాకు యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే 'రోలెక్స్' గురించి, అలానే 'కంగువ' డిజాస్టర్ కావడం గురించి మాట్లాడాడు. తన నుంచి ఈ ఏడాది మూడో చిత్రం కూడా రానుందని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: మరో ఆలోచన లేకుండా మాకు డబ్బులిచ్చింది.. సూర్య ఎమోషనల్)

'రోలెక్స్' సినిమా ఎప్పుడు మొదలవుతుందో, లోకేష్ ఏం చేస్తున్నాడో నాకు తెలీదు.. ఆయన ఇప్పటికే అల్లు అర్జున్ మూవీతో పాటు 'విక్రమ్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూల్లో 'రోలెక్స్' స్టోరీ రాస్తున్నానని చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. జీతూ మాధవన్‌తో చేస్తున్న నా మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం' అని సూర్య చెప్పుకొచ్చాడు.

రీసెంట్ టైంలో తన సినిమాలకు వచ్చిన ఫలితాల గురించి మాట్లాడిన సూర్య.. "దాదాపు 200 రోజుల పాటు ఎంతో నమ్మకంతో తీసిన మూవీ(కంగువ) పూర్తిగా ఫెయిలైంది. కేవలం 45 రోజుల్లో పూర్తయిన చిత్రం(కరుప్పు) ఈ ఏడాది పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండస్ట్రీలో విజయానికి ఎలాంటి ఫార్ములా లేదు. ఈ అనుభవాలే దాన్ని మరోసారి గుర్తుచేశాయి. 30 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత కూడా ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది' అని అన్నాడు.

సూర్య నటించిన 'కంగువ' 2024లో భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా నిరాశపరిచింది. దర్శకుడు శివ తీసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా భారీ నష్టాలని చవిచూసింది. దీని తర్వాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేసిన 'కరుప్పు' ఊహించని సక్సెస్ అందుకుని ఏకంగా రూ.300 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)