Breaking News

రేసు నుంచి తప్పుకోనున్న 'సూర్య'

Published on Wed, 09/24/2025 - 09:25

దక్షిణాదిలో ప్రముఖ కథానాయకుల్లో రాణిస్తున్న నటుడు సూర్య. ఈయన ఇటీవల హీరోగా నటించిన రెట్రో చిత్రం కమర్షియల్‌ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కరుప్పు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభయంకర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి శ్వాసిక, ఇందిరెన్స్‌, యోగి బాబు, శివదా, సుప్రీత్‌ రెడ్డి,  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

గ్రామీణ నేపథ్యంలో సాగే డివోషనల్‌ అంశాలతో సాగే సోషియల్‌ కథాచిత్రంగా రూపొందుతున్న కరుప్పు చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు యూనిట్‌ వర్గాలు ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశమే ఎక్కవగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విజయ్‌ కథానాయకుడుగా నటించిన జననాయకన్‌ విడుదుల కానుంది. ఆపై శివకార్తికేయన్‌ ,రవి మోహన్‌, శ్రీ లీల, అధర్వ కలిసి నటిస్తున్న పరాశక్తి కూడా రానుంది. 

సంక్రాంతి కోసం తెలుగులో ఇప్పటికే భారీగానే లైనప్‌ ఉంది.  దీంతో సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌ గా ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. సంక్రాంతి పోటీలో ఉండి ఇబ్బందులు పడటం ఎందుకని ఈ నిర్ణయం తీసుకునేందుకు చర్చిస్తున్నారట. ఏదేమైనా పొంగల్‌ రేసు నుంచి సూర్య తప్పుకోనున్నారనేది తెలుస్తోంది.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)