Breaking News

సూర్య కొత్త సినిమా.. అదంతా AIతోనే

Published on Mon, 10/14/2024 - 10:23

ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్(AI).. టెక్నాలజీ పరంగా ఇదో విప్లవం. ఎందుకంటే దీని వల్ల చాలా పనులు చేయడం సులభం అవుతోంది. దీనివల్ల భవిష్యత్‌లో చాలా ఉద్యోగాలు ఊడిపోవచ్చని కూడా అంటున్నారు. ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా కోసం ఏఐ సాంకేతికతోనే డబ్బింగ్ చెప్పాలని ఫిక్స్ అయ్యారు.

సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్‌తో దీన్ని తీస్తున్నారు. లెక్క ప్రకారం అక్టోబర్ 10నే రిలీజ్ కావాలి. కానీ రజినీకాంత్ మూవీ కోసం వాయిదా వేశారు. నవంబరు 14న దాదాపు 10 భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఫ్రెంచ్, ఇంగ్లీష్, స్పానిష్ భాషలు కూడా ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)

తాజాగా ఎక్స్(ట్విటర్)లో నెటిజన్లతో ముచ్చటించిన 'కంగువ' నిర్మాత కేఈ జ్ఞానవేల్.. సినిమా కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు. తమిళం వరకు సూర్య డబ్బింగ్ చెప్పగా.. మిగతా భాషల్లో మాత్రం ఏఐతో డబ్బింగ్ పూర్తి చేస్తామని అన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇలా ఈ టెక్నాలజీ ఉపయోగించడం ఇదే తొలిసారి. ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల పని గండంలో పడ్డట్లే!

'కంగువ' విషయానికొస్తే.. కంగ అనే ఓ యోధుడి జీవితమే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా సూర్య దాదాపు ఆరు గెటప్స్‌లో కనిపిస్తాడని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరయిన్. బాబీ డియోల్ విలన్. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు చేశారు.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)