Breaking News

కంగువా మరో డిజాస్టర్ కానుందా?.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!

Published on Sun, 11/17/2024 - 15:34

కోలీవుడ్ స్టార్‌ సూర్య నటించిన భారీ యాక్షన్‌ చిత్రం కంగువా. శివ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. భారీ అంచనాల మధ్య రిలీజైన కంగువా తొలి రోజు కేవలం ఇండియావ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఆ తర్వాత రెండో రోజు కంగువా వసూళ్లు మరింత తగ్గిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శనివారం వీకెండ్‌ కూడా కంగువాకు కలిసిరాలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో మూడు రోజుల్లో కేవలం రూ. 42.75 కోట్లకే పరిమితమైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో రోజుల్లోనే రూ.89.32 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

కాగా.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై నిర్మించారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూర్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్‌ బడ్జెట్‌ చిత్రంగా కంగువా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజులైనప్పటికీ ఇంకా రూ.100 కోట్ల మార్క్ చేరుకోకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)