Breaking News

కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో హీరో సూర్య

Published on Fri, 05/30/2025 - 16:53

స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ టైంలో మాత్రం 'కంగువ', 'రెట్రో' చిత్రాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కనబెడితే కొన్నాళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ గురించి అనుకోని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.

తమిళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న సూర్య.. తనతో పాటు కలిసి నటించిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. కూతురు దియా, కొడుకు దేవ్‌ కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం పిల్లల్ని పట్టుకుని జ్యోతిక.. ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో లేనిపోని రూమర్స్ వచ్చాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని.. ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ తాజాగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అటు సూర్య తల్లిదండ్రులు, ఇటు జ్యోతిక పేరెంట్స్ పాల్గొన్నారు. అందరూ ఒక్కచోట కనిపించడంతో ఇప్పటివరకు వినిపించిన మాటలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.

సూర్య కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్(ప్లస్ టూ) పూర్తి చేసింది. త్వరలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. మరి తల్లిదండ్రుల్లా దియా కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చూడటానికి మాత్రం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంది. మరి జ్యోతిక.. తన కూతురి గురించి ఏం ఆలోచిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!)

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)