Breaking News

సూర్య హీరోగా రూ. 1000కోట్ల బడ్జెట్‌తో శంకర్‌ సినిమా

Published on Sun, 09/11/2022 - 12:39

తమిళసినిమా: ఈ ఆధునిక యుగంలో ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు కథలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. అయితే దర్శకుడు శంకర్‌ తన చిత్రాల కథల విషయంలో మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెంటిల్‌మెన్‌ నుంచి 2.ఓ చిత్రం వరకు ఈయన చిత్రాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో రా మ్‌చరణ్‌ కథానాయకుడిగా చేస్తున్న చిత్రంతో పాటు తమిళంలో కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌–2 చిత్రాన్ని చేస్తున్నారు. వీటి తరువాత పొన్నియన్‌ చిత్ర హిందీ రీమేక్‌కు సిద్ధం అవుతారని సమాచారం.

ఆ తరువాత రూ. 1000 కోట్ల బడ్జెట్‌లో ఒక చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. లోక్‌సభ సభుయడు ఎస్‌.వెంకటేశ్‌ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి నవలను చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. దీని స్క్రీన్‌ప్లేను వెంకటేశ్, శంకర్‌ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీనిని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈయన బాలా దర్శకత్వంలో వణంగాన్‌ చిత్రం, శివ దర్శకత్వంలో తాను 42వ చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చేయాల్సి ఉంది. ఆ తరువాత శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకా శం ఉందని టాక్‌. ఇలాంటి చారిత్రక కథా చిత్రాలు కోలీవుడ్‌లో వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు రూపొంది సంచలన విజయం సాధించాయి. వాటి ఇన్సిఫిరేషన్‌తోనే శంకర్‌ ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే ఇంకా చాలా టైమ్‌ ఉంది.

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)