Breaking News

ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో స్టార్‌ హీరో దంపతులు.. వీడియో వైరల్!

Published on Tue, 09/17/2024 - 18:19

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే దసరాకు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన కంగువా.. ఊహించని విధంగా వాయిదా పడింది. రజినీకాంత్ వేట్టైయాన్‌ బరిలోకి రావడంతో కంగువా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా తన బంధువుల ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు సూర్య హాజరయ్యారు. తన భార్య జ్యోతికతో కలిసి జంటగా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఇందులో  కాబోయే నూతన వధూవరులకు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అందజేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య అభిమానుల సంఘం పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వేడుక తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిందని ఇన్‌స్టాలో ఓ అభిమాని షేర్ చేశారు. సూర్య కుటుంబానికి చెందిన బంధువుతో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: దసరా బాక్సాఫీస్‌.. రజినీకాంత్‌ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!)

ఇక సినిమాల విషయానికొస్తే త్వరలోనే కంగువా థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఓ సినిమాలో కనిపించనున్నారు. అంతేకాకుండా తన సోదరుడు కార్తీ, అరవింద్ స్వామిలతో కలిసి మీయజగన్‌ అనే చిత్రాన్ని  కూడా నిర్మిస్తున్నాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)