Breaking News

క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?

Published on Fri, 03/14/2025 - 14:37

టాలీవుడ్‌ నటి సురేఖ కూతురు సుప్రిత దాదాపు తెలుగువారికి సుపరిచితమే. ఆమె త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానుంది. బిగ్‌బాస్‌ -7 రన్నరప్‌ అమర్‌దీప్‌ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అంతేకాకుండా పీలింగ్స్‌ విత్‌ సుప్రిత అనే టాక్‌ షో చేస్తోంది. తాజాగా హోలీ సందర్భంగా అభిమానులకు విషెస్ తెలిపింది. దీంతో పాటు క్షమాపణలు కూడా కోరింది. ఇంతకీ సుప్రీత చేసిన తప్పేంటి। ఎందుకు క్షమాపణలు చెప్పిందో తెలుసుకుందాం.

ఇటీవల కొద్ది రోజులుగా పలువురు సోషల్ మీడియాలో బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీత సైతం తాను కూడా తెలిసో, తెలియక బెట్టింగ్ ప్రమోట్ చేశానని తెలిపింది. ఇక నుంచి అలా చేయడం లేదని.. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఎవరూ కూడా అలాంటి యాప్స్‌ను ఎంకరేజ్‌ చేయొద్దు.. ఈజీ మనీకి అలవాటు పడొద్దు.. అలాంటి వారికి సోషల్ మీడియాలో కూడా దూరంగా ఉండండి అంటూ వీడియో సందేశం ఇచ్చింది.

సుప్రీత మాట్లాడుతూ..' కొంతమంది తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను కూడా ఒకదాన్ని. అందుకే ఈ విషయంలో అందరికీ క్షమాపణలు కోరుతున్నా. ఎవరైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవీ చూసి వాటిని అనుసరించకండి. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. వారిని సోషల్ మీడియాలో ఫాలో కావొద్దు. అందరికీ థ్యాంక్యూ. అలాగే మీ అందరికీ మరోసారి సారీ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)