Breaking News

రజినీకాంత్‌ కూలీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published on Mon, 08/18/2025 - 13:59

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.  రిలీజ్‌కు ముందే ‍అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కావడంతో తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీ విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.410 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా పోస్ట్ చేశారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా కూలీ మూవీ దూసుకెళ్తోంది. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.194.25 కోట్లు నికర వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్‌ రాబట్టిన కూలీ.. రెండు వందల కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల నికర వసూళ్ల మార్క్‌ చేరుకోనుంది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్, సత్యరాజ్, చార్లీ లాంటి స్టార్స్‌ కీలక పాత్రల్లో నటించారు.


ఇండియాలో నెట్‌ కలెక్షన్స్‌..

1వ రోజు: రూ.65 కోట్లు

2వ రోజు: రూ.54.75 కోట్లు

3వ రోజు: రూ.39.5 కోట్లు

4వ రోజు: రూ.35 కోట్లు

మొత్తం: రూ.194.25 కోట్లు


 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)