Breaking News

ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

Published on Thu, 06/05/2025 - 10:12

తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్‌. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ హీరోగా టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌  'జాట్‌' ఏప్రిల్‌ 10న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌  నిర్మించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్‌.. బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో రణదీప్‌ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు.

జాట్‌ అసలు కథేంటంటే..?

ఆంధ్రప్రదేశ్‍లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్‍దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా  అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్‌ (సన్నీ డియోల్‌)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్‌కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్‌ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది.  ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్‌. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్‌తో జాట్‌ రెచ్చిపోతాడు. ఈ విషయం  కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్‌ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్‌కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)