Breaking News

ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ డియోల్.. వీడియో వైరల్

Published on Tue, 12/16/2025 - 21:56

బాలీవుడ్‌ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది జాట్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో 1997లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ మేకర్స్ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సన్నీ డియోల్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధర్మేంద్ర మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ టీజర్‌లోని డైలాగ్ చెబుతూ అభిమానులను అలరించారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఆవాజ్ ఎక్కడి వరకు వెళ్లాలి? అని సన్నీ డియోలా అనడంతో.. ప్రేక్షకులు లాహోర్ వరకు అంటూ గట్టిగా అరిచారు. ప్రేక్షకుల స్పందనతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మూవీ వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్‌కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్‌ సింగ్‌ తెరకెక్కించారు.  ఈ చిత్రంలో దిల్‌జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరంతా దేశాన్ని రక్షించడానికి పోరాడే సైనికుల పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మోనా సింగ్, సోనమ్ బాజ్వా, అన్య సింగ్, మేధా రాణా హీరోయిన్లుగా కనిపించనున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)