Breaking News

మళ్లీ వచ్చేస్తున్న హారర్‌ మూవీ.. ట్రైలర్‌ చూశారా?

Published on Mon, 04/01/2024 - 11:54

దర్శకుడు సుందర్‌ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్‌, ఏసీఎస్‌ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్‌ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

అప్పట్లో ఆ ఆలోచనే లేదు
హిప్‌ హాప్‌ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్‌ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్‌ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్‌లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్‌ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్‌ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్‌ ఒక విషయాన్ని చెప్పారన్నారు.

రాజులే భయపడ్డారు
అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్‌ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్‌ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్‌, యాక్షన్‌ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు.

చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)