Breaking News

నెలకు రూ.40 లక్షల భరణం.. అందుకే మేం కోర్టుకెళ్లాం

Published on Tue, 08/04/2026 - 11:03

తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి విడాకుల వ్యవహారంలో మరో ట్విస్ట్. తనతో పాటు పిల్లల మెంటెయినెన్స్ కోసం తన భర్త నెలకు రూ.40 లక్షల భరణం ఇచ్చే సదుపాయం కల్పించాలని ఆర్తి కోర్టుని ఆశ్రయించింది. సదరు పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం రూ.3 లక్షలు ఇస్తే చాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఆర్తి తల్లి సుజాత విజయకుమార్ స్పందించారు. భరణం వార్తలని ఖండించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: డిలీట్ చేయకపోతే కేసు పెడతా: మృణాల్‌ ఠాకుర్)

'ఆర్తి తన కోసం నెలకు రూ.40 లక్షలు అడగలేదు. రవిమోహన్ వల్ల మాకు చాలా అప్పులు ఉన్నాయి. ఇంటిపై బ్యాంకు జప్తు నోటీసు కూడా జారీ అయింది. పిల్లల స్కూల్ ఫీజులు, ఆహారం, ట్యూషన్ ఖర్చులు భరించడం మాకు చాలా కష్టంగా మారింది. పిల్లల విద్య, కుటుంబ పోషణకు సంబంధించి ఇప్పటికే కోర్టు రవిమోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు చదువుతున్న అమెరికన్ స్కూల్ ఏడాది ఫీజు రూ.86 లక్షలు రవిమోహనే చెల్లించాలని కోర్టు తెలిపింది. ఆర్తికి నెలకు రూ.3 లక్షలు, కొడుకులు ఆరవ్, అయాన్‌లకు తలో రూ.1 లక్ష చొప్పున ప్రతి నెల చెల్లించాలని స్పష్టం చేసింది. పిల్లల అదనపు విద్య, ఇతర కార్యకలాపాల ఖర్చులని కూడా భరించాలని పేర్కొంది' అని సుజాత చెప్పుకొచ్చారు.

రవిమోహన్‌.. పిల్లలని కలవకుండా ఆర్తి అడ్డుకుందనే ఆరోపణలని కూడా సుజాత ఖండించారు. 'మేమెప్పుడూ పిల్లలు తండ్రిని కలవొద్దని చెప్పలేదు. గత రెండేళ్లుగా ఇరువర్గాలను కలిపేందుకు ప్రయత్నించాం. ఇప్పుడు కోర్టు క్రమం తప్పకుండా తండ్రి-పిల్లలు కలుసుకునేలా ఆదేశాలు ఇవ్వడం మాకు ఊరటనిచ్చింది. గతంలో ఈ మీటింగ్స్ ఒక హీలర్ సమక్షంలో జరగాలనే రూల్ ఉండేసరికి పిల్లలు అసౌకర్యానికి గురయ్యారు. అందుకే వారు రాలేదు. ఏ తల్లి కూడా పిల్లలని తండ్రికి దూరం చేయాలని కోరుకోదు. ఈ నెల నుంచి కుటుంబంలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నాను' అని అన్నారు.

2009లో పెళ్లి చేసుకున్న రవి మోహన్.. దాదాపు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2024 సెప్టెంబరులో ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు.  అప్పటి నుంచి ఈ విడాకుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.

(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)