Breaking News

శివుడి పెయింటింగ్‌ అద్భుతంగా వేసిన టాలీవుడ్‌ హీరో

Published on Sat, 09/20/2025 - 15:50

టాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటుడు మాత్రమే కాదు, తనలో మరో కళ కూడా ఉంది. అదే పెయింటింగ్‌ కళ! తాజాగా అతడు తన చేతులతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు. నీలకంఠుడి పెయింటింగ్‌ వేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. నేను ఎవరి పెయింటింగ్‌ వేస్తున్నాననుకుంటున్నారు? ఎవరైనా అందమైన అమ్మాయిల బొమ్మలు గీస్తుంటారు. 

అందగాడి బొమ్మ గీస్తున్నా..
కానీ నేను ఒక అందగాడి బొమ్మను గీస్తున్నా.. ఆయన ఎలాంటి అందగాడంటే అందాన్ని చందమామతో పోలుస్తాం కదా.. ఆ చందమామ ఆయన తలలో ఏదో ఒక మూలన పడి ఉంటుంది. అసలాయన అందం ముందు చందమామను ఎవరూ పట్టించుకోరు. మనమంతా అందంగా కనిపించడానికి మంచిగా హెయిర్‌స్టైల్‌ చేసుకుంటే ఆయనేమో జుట్టునసలు పట్టించుకోనే పట్టించుకోడు. అందుకే ఆయన జుట్టు ఎప్పుడూ ఏదో దారాలు చిక్కుక్కున్నట్లు చిక్కుముడుల్లా ఉంటుంది. 

ఆ బొమ్మే జటాధర
అందుకే ఆయన్ని జటాధర అని పిలుస్తారు. ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి. అందుకోసం నేనో బొమ్మ (సినిమా) తీశాను.. ఆ బొమ్మే జటాధర. అందరూ థియేటర్లలో జటాధర చూడండి అని చెప్పుకొచ్చాడు. జటాధర విషయానికి వస్తే.. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దర్శక ద్వయం వెంకట్‌ కల్యాణ్‌– అభిషేక్‌ జైస్వాల్‌ తెరకెక్కించారు. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నవంబర్‌ 7న విడుదల కానుంది.

 

 

చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్‌ కామెంట్స్‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)