Breaking News

'మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి'.. జటాధర రిలీజ్ ట్రైలర్ చూశారా?

Published on Wed, 11/05/2025 - 16:23

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer).  ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. ‍అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

ఈ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి ‍అనే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్‌తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్‌ కట్‌ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్‌ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.

ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది.  ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది. 
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)