నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
Breaking News
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
Published on Tue, 06/30/2026 - 14:41
ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో వసూళ్లు రాబట్టాయి. మరోవైపు తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల లాంటి స్టార్స్ చేసిన 'పరాశక్తి' ఘోరమైన డిజాస్టర్ అయింది. గతంలో ఓ సందర్భంలో చిత్ర నిర్మాత దీని వల్ల వచ్చిన నష్టాల గురించి చెప్పగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.
(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్)
'పరాశక్తి' తీసిన దర్శకురాలు సుధా కొంగర.. నిర్మాతకు తనకు రూ.8.39 కోట్ల రెమ్యునరేషన్ బకాయి ఉన్నారని చెప్పి మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. పలు కారణాలతో ఆలస్యమైన ఈ చిత్రం.. అన్ని సమస్యలు దాటుకుని సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దర్శకురాలి రెమ్యునరేషన్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది.
ఇక మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. జూలై 8న తదుపరి విచారణ జరిగే వరకు 'పరాశక్తి' శాటిలైట్ హక్కులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే నిర్మాత తీసిన 'ఇదయం మురళి' మూవీ వచ్చే నెల 10న థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇది విడుదల కాకుండా ఆపాలని సుధా కొంగన తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.
సుధా కొంగర విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం దగ్గర పనిచేసింది. 'సాలా ఖాదుస్' మూవీతో డైరెక్టర్ అయింది. దీన్ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రానికి ఈమెనే దర్శకత్వం వహించింది. స్వతహాగా ఈమె తెలుగు ఆమెనే అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేస్తోంది.
(ఇదీ చదవండి: పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి)
Tags : 1