Breaking News

'21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ

Published on Sun, 06/29/2025 - 13:17

ఒక్క పాటతో పడిపోయింది బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ రాయగురు. నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌తో కలిసి మేజస్టీ ఇన్‌ లవ్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ వెంటనే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. అయితే అతడికి బోలెడంత ఆస్తి ఉందని, 21 కార్లున్నాయని.. అందుకే మనోభావాలు పాప వెంటనే పెళ్లికి కూడా సిద్ధపడిపోయిందని ట్రోలింగ్‌ జరిగింది.

మోడల్‌గా..
తాజాగా ఈ ట్రోలింగ్‌పై శుభశ్రీ రాయగురు (SubhaShree Rayaguru) స్పందించింది. అలాగే తన ప్రేమకథను, పర్సనల్‌ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ మాట్లాడుతూ.. మాది లీగల్‌ ఫ్యామిలీ.. నాన్న జడ్జి. కాబట్టి నేను కూడా న్యాయవిద్య చదివాను. ముంబైలో లా చదువుతున్న సమయంలో మోడలింగ్‌ చేశాను. ఫెమినా మిస్‌ ఇండియా ఒరిస్సాగా టైటిల్‌ గెలిచాను. ఐఏఎస్‌ కోచింగ్‌కు వెళ్దామనుకునే సమయంలో ఈ ట్రోఫీ రావడంతో మనసు మారింది. సినిమాలు ట్రై చేశాను. అలా బిగ్‌బాస్‌ ఆఫర్‌ కూడా వచ్చింది. ఈ షోకు వెళ్లాక నాకు చాలా ఫేమ్‌ వచ్చింది.

సాంగ్‌ షూటింగ్‌లో పరిచయం
ఈ మధ్యే మేజస్టీ సాంగ్‌ చేశాను. ఆస్ట్రేలియాలో జరిగిన సాంగ్‌ షూటింగ్‌లో అజయ్‌ను తొలిసారి కలిశాను. సహనటుల్లాగే మాట్లాడుకునేవాళ్లం. వారం రోజులపాటు షూటింగ్‌ జరిగింది. చివరి రోజు షూటింగ్‌లో తను నాకు ప్రపోజ్‌ చేస్తుంటే నాకు తెలియకుండానే ఎంజాయ్‌ చేశాను. అలా 9 నెలల కిందట మా ప్రేమ మొదలైంది. మా ప్రేమకు ఇంట్లోవాళ్లు వెంటనే ఒప్పుకోలేదు. నెమ్మదిగా అంగీకరించారు. 

డబ్బు కోసమే పెళ్లి?
మా ఇద్దరి గురించి సోషల్‌ మీడియాలో చాలా ట్రోల్‌ చేశారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు. అతడెలా నచ్చాడు? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా? అని వాగారు. అలా అనడానికి మీకెంత ధైర్యం? నేను ఎలాంటి పార్ట్‌నర్‌ను ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అయినా ఈ జనరేషన్‌ యువత ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నమ్మలేకపోయాను. నాకంటూ సొంతిల్లుంది, కారుంది, బాగానే డబ్బు సంపాదించాను. నాకెవరి డబ్బులు అక్కర్లేదు.

పెళ్లే కాలేదు.. భరణం గురించి కామెంట్స్‌
నేను పెళ్లి చేసుకునే అబ్బాయి నాకు గౌరవం ఇస్తాడా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడా? అని మాత్రమే చూస్తాను. ఈ లక్షణాలు లేకపోతే ఎంత డబ్బున్నా నేను పెళ్లి చేసుకోను. అజయ్‌ పరిచయమైనప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ 9 నెలలకాలంలో నేను ఎక్కువగా ఏడ్చింది లేదు. నాకు మనిషి లుక్స్‌ గురించి అవసరం లేదు. మేమిద్దరం సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. మహా అయితే ఆరు నెలలు కలిసుంటారు.. భరణం ఎంత తీసుకుంటారు? ఇలాంటి కామెంట్లు చూసి తట్టుకోలేకపోయాను. 

ట్రోలింగ్‌ దెబ్బకు జ్వరం
ఈ ట్రోల్స్‌ చూసి ఏడ్చేశాను. ఇంకా పెళ్లే కాలేదు. భరణం దాకా వెళ్లిపోయారేంట్రా? అనుకున్నా.. ఆ కామెంట్ల దెబ్బతో నిశ్చితార్థం అయిన రెండురోజులకే నాకు జ్వరం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా తిడుతున్నారు? అని నాలో నేనే బాధపడ్డాను. అజయ్‌ ఇంట్లోవాళ్లు కూడా చాలా ఫీల్‌ అయ్యారు. దయచేసి నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని శుభశ్రీ కోరింది. ఈమె రుద్రవీణ, అమిగోస్‌, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించింది.

 

 

చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్‌ భావోద్వేగం

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)