కన్నడలో సూపర్ హిట్.. ఇప్పుడు తెలుగులో రిలీజ్

Published on Sun, 08/03/2025 - 20:51

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో హిట్టయిన సినిమాల్ని మన దగ్గర డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. లేదంటే నేరుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అలానే కన్నడలో ఈ మధ్యనే రిలీజ్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న ఓ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ విషయమై అప్‌డేట్ ఇ‍చ్చారు.

వచ్చే వారం థియేటర్లలో వార్ 2, కూలీ చిత్రాలు రాబోతున్నాయి. కాబట్టి కన్నడ హిట్ మూవీ 'సు ఫ్రమ్ సో'ని ఈ వారమే (ఆగస్టు 08) థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉంది?

(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ సినిమా)

'సు ఫ్రమ్ సో' అనేది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ హారర్ కామెడీ మూవీ. అసలు విషయానికొస్తే.. తీర ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తిరుగుతుంటాడు. అతడిని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకార్లు ఊరంతటా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊరిలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమేంటి? సులోచన దెయ్యం నిజమేనా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. దర్శకత్వం కూడా వహించాడు. స్టోరీ కూడా అతడిదే. ప్రముఖ కన్నడ హీరో కమ్ దర్శకుడు రాజ్ బి శెట్టి.. ఓ నిర్మాతగా వ్యవహరించాడు. కన్నడలో హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)