Breaking News

కంగువని థియేటర్స్‌లోనే చూడాలి: ఎస్‌ఎస్‌ రాజమౌళి

Published on Fri, 11/08/2024 - 03:03

‘‘కంగువ’ టీమ్‌ పడిన కష్టం మేకింగ్‌ వీడియోలో తెలుస్తోంది. సినిమా రిలీజ్‌ అయ్యాక ఈ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నాను. ‘కంగువ’ లాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్‌ అనుభూతిని ΄పొందుతారు’’ అని డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘కంగువ’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు. 

గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కంగువ’ ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాను తెలుగుకే పరిమితం చేయకుండా మిగతా ్రపాంతాలకు తీసుకెళ్లాలని, అలాగే పాన్‌ ఇండియా మూవీస్‌ చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. ‘గజినీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి తను చేసిన ప్రయత్నాన్ని కేస్‌ స్టడీగా నా నిర్మాతలు, హీరోలకు చెప్పేవాణ్ణి. నేను, తను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం.. కానీ కుదరలేదు. తనతో సినిమా చేసే అవకాశం నేను మిస్‌ అయ్యాను’’ అని చెప్పారు. ‘‘కంగువ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చూస్తుంటే ఇది సక్సెస్‌ సెలబ్రేషన్స్లా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.

‘‘ఈ సినిమా విజువల్స్, కంటెంట్‌ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ‘కంగువ’ ఘన విజయం సాధించాలి’’ అని నిర్మాతలు సురేష్‌ బాబు, ‘దిల్‌’ రాజు తెలిపారు. ‘‘వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ ‘కంగువ’లో చూపించాం’’ అన్నారు శివ. ‘‘కంగువ’ వంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయాలి’’ అని కేఈ జ్ఞానవేల్‌ రాజా చెప్పారు. సూర్య మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి ఏ సినిమాతోనూ మా ‘కంగువ’ని పోల్చలేం. ఆయనతో సినిమా చేసే అవకాశం మిస్‌ చేసుకున్నాను.

కానీ, ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ‘కంగువ’ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చింది. ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఎవర్‌ గ్రీన్‌ సినిమాగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను’’ అని తెలిపారు. ఈ వేడుకలో డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, హీరోలు విశ్వక్‌ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కెమెరామేన్‌ వెట్రి పళనిస్వామి, రైటర్‌ రాకేందు మౌళి, డిస్ట్రిబ్యూటర్‌ అభినేష్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ శశి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వివేక్‌ కూఛిబొట్ల తదితరులు మాట్లాడారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)