Breaking News

ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ శ్రీదేవిదే

Published on Wed, 08/13/2025 - 10:20

టాలీవుడ్‌లో ఇప్పటివరకు వందలాది మంది హీరోయిన్లు వచ్చారు, వస్తూనే ఉన్నారు. కానీ శ్రీదేవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం వేరే లెవల్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ అతిలోక సుందరి అలా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమైన ఈమె.. ప్రమాదవశాత్తు తనువు చాలించడం మాత్రం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేని చేదు జ్ఞాపకం. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె సృష్టించిన క్రేజీ రికార్డ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)

1963 ఆగస్టు 13న తమిళనాడులో పుట్టింది శ్రీదేవి. అయితే ఈమె అసలు పేరు ఇది కాదు. శ్రీ అమ్మ అయ్యంగర్. నాలుగేళ్ల వయసులోనే ఓ తమిళ సినిమాలో నటించింది. అప్పుడు తన స్క్రీన్ నేమ్ శ్రీదేవిగా మార్చుకుంది. 1970 నుంచి అయితే వరసగా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ మూవీస్ చేస్తూనే ఉంది. అలా దాదాపు 200కి పైగా చిత్రాలు చేసి తిరుగులేని హీరోయిన్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'మా బంగారక్క'.. తెలుగులో హీరోయిన్‌గా శ్రీదేవికి తొలి సినిమా. కానీ రాఘవేంద్రరావు తీసిన 'పదహారేళ్ల వయసు' మూవీ ఈమెని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. అక్కడి నుంచి మొదలుపెడితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ శ్రీదేవి వరసపెట్టి సినిమాలు చేసింది. అద్భుతమైన హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.

(ఇదీ చదవండి: 'తెలుగులో అల్లు అర్జున్‌'.. జాన్వీ కపూర్‌ పరమ్ సుందరి ట్రైలర్‌)

అయితే శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది కదా.. అప్పట్లో పలువురు స్టార్ హీరోలకు మనవరాలు, కూతురిగా చేసిన ఈమె.. పెరిగి పెద్దయిన తర్వాత ఒకరిద్దరు అదే హీరోల పక్కన హీరోయిన్‌గానూ చేయడం విశేషం. ఈ రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ ఏ హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేరేమో? అంటే ఈ ఘనత మాత్రం ఎప్పటికీ శ్రీదేవి సొంతం.

శ్రీదేవికి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు. కానీ వీళ్లిద్దరూ నటించడం చూడకుండానే శ్రీదేవి మరణించింది. బహుశా ఇదొక్కటే ఈమెకు తీరనిలోటు అని చెప్పొచ్చు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి.. ప్రమాదవశాత్తు మరణిస్తే అదే ఏడాది జూలై ఈమె పెద్ద కూతురు జాన్వీ తొలి సినిమా రిలీజైంది. ఇప్పుడు జాన్వీ.. హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది. 

(ఇదీ చదవండి: మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)