తమిళ హీరోలతో రొమాన్స్‌.. తెలుగు హీరోలపై కోపం?

Published on Fri, 03/20/2026 - 16:01

తమిళ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్‌. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్‌ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్‌టుడే సినిమాకు ప్రదీప్‌ రంగనాథన్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్‌ (మరియ ఇళంజెళియన్‌) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు హీరోలపై కోపం?
ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్‌ తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్‌గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్‌గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.

నేనేమైనా కంకణ కట్టుకున్నానా?
ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్‌లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్‌ చేస్తున్నారు అని బదులిచ్చింది.

సినిమా
తెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్‌, మ్యాడ్‌, మెయిల్‌ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్‌ మూవీలో ఈమె.. హీరో రామ్‌ నితిన్‌ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్‌స్టోరీ చిత్రాలున్నాయి.

చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్‌ కపుల్‌

Videos

సిగ్గుచేటు.. గరికపాటి గుడ్డు వివాదం

ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన

రోడ్లపైకి టెస్లా సెమీ ట్రక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 KM

పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?

ప్లాన్ మార్చిన అమెరికా.. ట్రంప్ టార్గెట్ ఏంటంటే?

షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా భాద అనిపించలేదా తల్లి..?

చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ

మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్ళకు సగం ఆస్తి పంచాడా...?

ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

Photos

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)