Breaking News

'పుష్ప' ఎఫెక్ట్‌.. శ్రీ లీలకు తమిళ స్టార్‌ హీరోతో సినిమా ఛాన్స్‌

Published on Tue, 11/26/2024 - 07:08

టాలీవుడ్‌లో క్రేజీ నటిగా రానిస్తున్న శ్రీలీలపై కోలీవుడ్‌ మనసుపడుతుంది. పుష్ప ప్రమోషన్‌ కార్యక్రమంలో కిస్సిక్‌ అంటూ మెరిసిన ఈ బ్యూటీపై తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల దృష్టి  పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు శ్రీ లీలను తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు అప్పుడే మొదలెట్టారు. ఇప్పటికే నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన గోట్‌ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటింపజేసే ప్రయత్నం జరిగింది. ఐయితే అందులో నటించడానికి శ్రీ లీల ఆసక్తి చూపలేదనే ప్రచారం జరిగింది. 

అలాంటిది ఇప్పుడు నటుడు అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం పుష్ప –2 చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ చేయడం విశేషం. అయితే తమిళంలో కథానాయకిగానే పరిచయం అవ్వాలని ఈ బ్యూటీ కోరుతున్నారని తెలిసింది. అలాంటి అవకాశం ఇప్పుడు శ్రీలీల తలుపు తట్టిందని సమాచారం. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌. ఇటీవల అమరన్‌ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఈయన ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని తరువాత సీబీ చక్రవర్తి, నెల్సన్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కోలీవుడ్‌లో హీరోయిన్‌గానే ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న ఈ బ్యూటీ కల పుష్ప ఐటమ్‌ సాంగ్‌తో తీరనుందని తెలుస్తోంది. 

ఇదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటించడానికి కమిట్‌ అయ్యారు. నటుడు సూర్య నటించాల్సిన ఈ చిత్రం నుంచి ఆయన వైదొలగడంతో ఇప్పుడు ఆ పాత్రలో శివకార్తికేయన్‌ నటించనున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్‌ ఖరారు చేశారు. కాగా ఈ చిత్రంలోనే నటి శ్రీలీలను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల శివకార్తికేయన్‌కు జంటగా నటించానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాలు సమాచారం.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)