Breaking News

శ్రీలీల సక్సెస్‌ వెనుక జూనియర్‌ ఎన్టీఆర్‌.. అప్పుడే డిసైడయ్యా!

Published on Sun, 08/24/2025 - 11:06

స్ప్రింగులా బాడీని కదిలిస్తూ అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR). సింగిల్‌ టేక్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న తారక్‌.. డ్యాన్స్‌లోనూ టాప్‌ హీరోగా తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. అయితే డ్యాన్స్‌ ఇరగదీస్తున్న హీరోయిన్‌ శ్రీలీలకు తారక్‌ ఆదర్శమట! ఈ విషయాన్ని ఆమె తల్లి డాక్టర్‌ స్వర్ణలత చెప్పుకొచ్చింది. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి శ్రీలీల హాజరైంది. 

అప్పుడే డిసైడయ్యా..
శ్రీలీల (Sreeleela) గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పేందుకు ఆమె తల్లి స్వర్ణలత కూడా వేదికపై వచ్చింది. ఈ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఆమె ప్రస్తావించింది. తారక్‌ చిన్నప్పుడు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన ఫోటోను జగపతిబాబు చూపించాడు. అది చూసిన స్వర్ణలత.. నాకు ఆడపిల్ల పుడితే డ్యాన్స్‌ నేర్పించాలని ఈ ఫోటో చూశాకే డిసైడ్‌ అయ్యాను.

ఎన్టీఆర్‌తో మాట్లాడా..
1997లో లాస్‌ ఏంజిల్స్‌లో తానా సభలు జరిగాయి. మేము అక్కడికి వెళ్లాం. అక్కడ తారక్‌ డ్యాన్స్‌ చేశాడు. అనంతరం తారక్‌తో మాట్లాడాను. నాకు అమ్మాయి పుడితే కచ్చితంగా నీలా డ్యాన్స్‌ చేయిస్తాను అని చెప్పాను. అనుకున్నట్లుగానే నా కూతురిని డ్యాన్సర్‌ చేశాను అని తెలిపింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే శ్రీలీల మంచి డ్యాన్సర్‌ అయిందని పేర్కొంది.

సినిమా
శ్రీలీల.. పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ధమాకా, గుంటూరు కారం, భగవంత్‌ కేసరి, జూనియర్‌.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్‌ కిస్‌ కిస్సిక్‌..' అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. జూనియర్‌ మూవీలోని వైరల్‌ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈమె రవితేజ సరసన నటించిన మాస్‌ జాతర త్వరలోనే రిలీజ్‌ కానుంది.

 

 

చదవండి: అజిత్ భాయ్.. ఏంటా స్పీడ్.. ఇదేమైనా రేసింగ్ అనుకున్నావా?

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి