పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
Breaking News
శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!
Published on Sat, 03/21/2026 - 16:39
ఓ సినిమా హిట్-ఫ్లాప్ అనేది చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అంటే స్టార్ హీరోల మూవీస్ ఓ మోస్తరుగా ఉన్నా ఆడేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అభిమానుల కోసం స్పెషల్‌గా తీశామని దర్శకులు చెబుతున్నా ఎందుకనో పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చింది. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.
(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్)
విడుదలైన రోజు ఉగాది కావడం, 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ షోలు పడకపోవడంతో ఉన్నంతలో ఆడియెన్స్ ఈ మూవీకి వచ్చారు. దీంతో రూ.30 కోట్లకు పైనే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ రెండురోజుకి(శుక్రవారం) వసూళ్లలో విపరీతమైన డ్రాప్ కనిపించింది. కేవలం రూ.9 కోట్లే వచ్చాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వీకెండ్ అయ్యేసరికి మరింతగా వసూళ్లు తగ్గిపోవచ్చు.
ఇకపోతే ఈ మూవీలో పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. రాశీఖన్నా పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండాఫ్‌ని ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీలీల కనిపిస్తుంది. ఈమె వరకు యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఎందుకనో ఈ మూవీ కూడా ఈమెకు కలిసివచ్చేలా కనిపించట్లేదు. 'ఉస్తాద్..' సక్సెస్‌పై ఈమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం రెండు మూడు చిత్రాలు కూడా వదిలేసుకుంది. చూస్తే ఇప్పుడి పవన్ కల్యాణ్ కూడా ఈమెని కాపాడలేకపోయాడనిపిస్తోంది.
తెలుగులో గత ఐదేళ్ల నుంచి శ్రీలీల సినిమాలు చేస్తోంది. తొలి చిత్రం 'పెళ్లి సందడి' పర్లేదనిపించింది. రవితేజతో చేసిన 'ధమాకా' సూపర్ హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే హిట్ అనిపించింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర వరకు అన్ని ఫెయిల్యూర్సే. తమిళంలో ఈ సంక్రాంతికి వచ్చిన మొదటి మూవీ 'పరాశక్తి'ది కూడా ఇదే ఫలితం. ఇప్పుడు పవన్ 'ఉస్తాద్..' కూడా ఇదే లిస్టులో చేరేలా కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)
Tags : 1