Breaking News

స్పైడర్ మ్యాన్‌ బ్రాండ్ న్యూ డే.. రెండో రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

Published on Sun, 08/02/2026 - 01:40

హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే'. జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.60.60 కోట్ల నెట్.. రూ.72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.

రెండో రోజు కూడా స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే వసూళ్లు హవా కొనసాగింది. ఇండియావ్యాప్తంగా 16,902 షోల ద్వారా రూ.49.35 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్‌లో ఈ మూవీ రూ.131.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నెట్ కలెక్షన్ల విషయానికొస్తే రూ.109.95 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా  తొలిరోజే సుమారు 167 నుంచి 173 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బద్దలు కొడుతోంది. తొలిరోజు వసూళ్లతో జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్’(రూ.40కోట్లు), రూసో బ్రదర్స్ అవెంజర్స్: ఎండ్‌గేమ్ (రూ.53కోట్లు) రికార్డులను బ్రేక్‌ చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి భారత్‌లో రూ.200 కోట్ల మార్కును దాటుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టామ్ హాలండ్‌తో పాటు జెండాయా, జాకబ్ బాటలాన్, సేడీ సింక్, జాన్ బెర్న్‌తాల్‌, ట్రామెల్ టిల్మాన్ కీలక పాత్రలు పోషించారు.

 

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)