Breaking News

రోడ్డు ప్రమాదంలో స్టార్‌ నటుడు మృతి అంటూ ప్రచారం

Published on Sun, 02/16/2025 - 13:12

చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్‌గా రాణిస్తున్న‌ యోగిబాబు రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కొంత సమయం క్రితం సోషల్‌మీడియా ద్వారా ఒక పోస్ట్‌ ద్వారా ఆయన వివరణ ఇచ్చారు. యోగిబాబు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని  చెప్పుకొచ్చారు. ఇలాంటి కల్పిత వార్తల పట్ల తాను చింతిస్తున్నట్లు యోగిబాబు తెలిపారు.

చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై  తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యోగిబాబు మరణించారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే నెట్టింట ట్రెండ్‌ అయిపోయింది. దీంతో యోగి బాబు తన ఎక్స్‌ పేజీలో వివరణ ఇస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. 'నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కానీ, ఆ కారులో ఉన్నది నేను కాదు. కనీసం  నా సహాయకుడు కూడా ఆ కారులో ప్రయాణించలేదు. 

సినిమా షూటింగ్‌ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుపుతున్నాను. తప్పుడు వార్తల వల్ల  నా స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు, పత్రికాధిపతులు వంటి అనేకమంది నాకు ఫోన్‌ కాల్స్‌ చేస్తూనే ఉన్నారు. నా క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. నా పట్ల వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.' అని ఆయన తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)