మోనికా సాంగ్‌.. డ్యాన్స్‌తో డామినేట్‌ చేసిన నటుడు

Published on Sat, 07/12/2025 - 19:09

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా (Coolie Movie)పై భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోలు భాగం కావడంతో కూలీ మూవీ గురించి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచందర్‌ అందించిన మోనికా అనే ఐటం సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో పూజా హెగ్డే అందంతో, డ్యాన్స్‌తో అదరగొట్టింది. 

అప్పుడు జిగేలు రాణి.. ఇప్పుడు మోనికా
ఇలా స్పెషల్‌ సాంగ్స్‌ చేయడం పూజకు కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం మూవీలో జిగేలురాణి పాటకు సూపర్‌గా డ్యాన్స్‌ చేసింది. ఎఫ్‌ 3 మూవీలోనూ లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇట్టా ఉండాలా పాటతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె కనిపించిన చివరి సినిమా అదే! ఇటీవల తమిళ రెట్రో మూవీలో కథానాయికగా అలరించింది. కన్నిమా పాటకు ఎక్స్‌ప్రెషన్‌, గ్రేస్‌తో అదరగొట్టేసింది. ఇప్పుడు కూలీలో మోనికాగా సెన్సేషన్‌ సృష్టిస్తోంది. 

దడదడలాడించిన సౌబిన్‌
అయితే ఈ పాటలో మలయాళ నటుడు సౌబిన్‌ షాహిర్‌ (Soubin Shahir) పూజానే డామినేట్‌ చేస్తున్నాడు. హీరోయిన్‌తో పోటీపడుతూ స్టెప్పులేశాడు. ఆ క్లిప్పింగ్స్‌ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ నటుడిని మీరు గుర్తుపట్టే ఉంటారు. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ మంజుమ్మల్‌ బాయ్స్‌లో యాక్ట్‌ చేశాడు. ఇప్పుడు మోనికా పాటలో సింపుల్‌ లుక్‌లోనే సూపర్‌ స్టెప్పులేస్తూ ఫుల్‌ హైలైట్‌ అవుతున్నాడు. స్పెషల్‌ సాంగ్‌లో సౌబిన్‌తో స్టెప్పులేయించాలన్న ఆలోచన రావడమే గ్రేట్‌ అంటూ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ను నెటిజన్లు పొగుడుతున్నారు.

 

చదవండి: 'బిగ్‌బాస్‌'లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆమె కూడా!

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)