Breaking News

తన బేబీబంప్‌ ఫొటోలు షేర్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌

Published on Mon, 04/04/2022 - 10:46

Sonam Kapoor Shares Her Latest Baby Bump Photos: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, నటుడు అనిల్‌ కపూర్‌ కూతురు సోనమ్‌ కపూర్‌ త్వరలో తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన భర్త అనంద్‌ ఆహుజాతో కలిసి తన ప్రగ్నెన్సీని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన తాజా బేబీబంప్‌ ఫొటోషూట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సోనమ్‌. వైట్‌ సారీతో డిఫరెంట్‌ చీరకట్టుతో ఇచ్చిన ఈ ఫొటోషూట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్‌ చేస్తూ.. అబుజానీ బర్త్‌డే పార్టీ సందర్భంగా దిగిన ఫొటోలని, ఈ చీరను తన సోదరి రియా కపూర్‌ డిజైన్‌ చేసినట్లు ఆమె పేర్కొంది. 

చదవండి: అందుకే ‘ఆదిపురుష్‌’గా ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌: ఓం రౌత్‌

కాగా సోనమ్‌ కపూర్‌ను బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ అని పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. సినిమా ఈవెంట్స్‌కు, అవార్డు ఫంక్షన్స్‌ ఆమె స్టైలిష్‌, డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌ దుస్తులు ధరించి అందరిని అట్రాక్ట్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో తన బేబీబంప్‌ ఫొటోషూట్‌లో కూడా సోనమ్‌ తనదైన ఫ్యాషన్‌ దివాను చూపించింది. డిఫరెంట్‌ చీరకట్టుతో దిగిన ఆమె బేబీబంప్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తల్లి కాబోతోన్న సోనమ్‌ కపూర్‌ ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన ప్రెగ్నెన్సీ అనుభవాన్ని పంచుకుంది.

చదవండి: హీరోయిన్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాక్‌, అప్రమత్తం చేసిన యామీ

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎంత కఠినంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ, ఎంతటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందనేది మాత్రమే చెబుతారు’ అని పేర్కొంది. అలాగే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తున్నానంటూ సొనమ్‌ ఆనందం వ్యక్తం చేసింది. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్‌ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)