నేరుగా ఓటీటీకి హారర్‌ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Tue, 06/25/2024 - 18:22

ఇటీవల కాలంలో హారర్‌, కామెడీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా అలాంటి చిత్రం ద్వారా అలరించేందుకు వస్తోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. కకుడా అనే మూవీతో అభిమానులను పలకరించునుంది. ఈ చిత్రంలో రితేష్‌ దేశ్‌ముఖ్, సాక్విబ్‌ సలీమ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్‌ కామెడీ కథాంశంతో మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్‌దర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్‌ విడుదల చేశారు. జూలై 12వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. తాజా పోస్టర్ చూస్తే దెయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ‍అలరించింది సోనాక్షి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ తారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)