Breaking News

'మర్యాద రామన్న'కు రీమేక్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా

Published on Fri, 07/11/2025 - 14:42

తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)

2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్‌లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.

ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్‌ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)