Breaking News

పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. హీరో ఎవరంటే?

Published on Tue, 09/30/2025 - 12:38

గతేడాది డిసెంబరు నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఇకపోతే నాగచైతన్య.. ఓ హారర్ మూవీలో నటిస్తుండగా శోభిత మాత్రం మొన్నటివరకు కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల గ్యాప్ ఇస్తుందా అనుకున్నార. కానీ అలాంటిదేం లేదని ఓ మూవీ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: హర్ట్ అయిపోయిన దీపిక పదుకొణె.. ఆ డైరెక్టర్‌తో కటీఫ్)

శోభిత ప్రెగ్నెన్సీతో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. అయితే అవి పుకార్లు మాత్రమేనని ఇప్పుడు ఓ తమిళ సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. పా.రంజిత్ తీస్తున్న 'వెట్టువం' అనే చిత్రంలో శోభితని తీసుకున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. గతంలో తమిళంలో మణిరత్నం తీసిన 'పొన్నియిన్ సెల్వన్'లో నటించింది. కాకపోతే అది హీరోయిన్ పాత్ర కాదు. ఇప్పుడు మాత్రమే ఈమెనే లీడ్.

దినేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆర్య మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శోభిత హీరోయిన్. పా.రంజిత్ సినిమాలన్నీ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత శోభిత.. తెలుగులో ఏమైనా మూవీస్ చేస్తుందని చాలామంది అనుకున్నారు కానీ తమిళంలో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. గతంలో తెలుగులో గూఢచారి, మేజర్ మూవీస్ చేసింది.

(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి లేదుగా సాహో రేంజీ...)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)