Breaking News

హీరో ఆఫర్లు వద్దని.. స్టార్‌గా మారిన శోభన్‌ బాబు మనవడు ...

Published on Sat, 05/10/2025 - 17:57

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నట భూషణుడు శోభన్‌ బాబు(Sobhan Babu).. ఎన్టీయార్, కృష్ణ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా మహిళాదరణలో ఆయనకు సాటిలేదు. తన సమకాలీకులైన మిగిలిన హీరోల్లా కాకుండా సినీరంగానికి దూరమైన తర్వాత ఆయన కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు పబ్లిక్‌ లైఫ్‌ నుంచే అదృశ్యం అయిపోయారు. అంతేకాదు ఆయన వారసులను కూడా ఎవరినీ సినీ రంగంలోకి పరిచయం చేయలేదు. దాంతో ఆయన దివంగతులయాక ఆయన వారసులకు సంబంధించిన విశేషాలు కూడా ఎక్కడా పెద్దగా వెలుగు చూడలేదు. 

ఈ నేపధ్యంలో తాజాగా  శోభన్‌ బాబు మనవడు డాక్టర్‌ సురక్షిత్‌ బత్తిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారంటూ వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి రేకెత్తించాయి. అలనాటి అందాల నటుడి రూపాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు... పలు సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన సురక్షిత్‌...సార్ధక నామధేయుడిగా మారి ఎంచుకున్న రంగంలో  స్టార్‌ అనిపించుకుంటున్నారు.

(చదవండి: రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?)

తమిళనాడులో స్థిరపడ్డ ఆయన సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో తాతకు తగ్గ  మనవడుగా రాణిస్తుండడం అందర్నీ ఆకర్షిస్తోంది.  దాదాపు  4.5 కిలోల గర్భాశయాన్ని అత్యాధునిక సాంకేతికత ద్వారా తొలగించి డాక్టర్‌ సురక్షిత్‌ బత్తిన వైద్యరంగంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు.  తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు గర్భాశయంలో భారీ కణితి ఏర్పడింది.  ఇతర ఆస్పత్రులు ఓపెన్‌ సర్జరీ తప్ప మార్గం లేదని సూచించగా, డాక్టర్‌ సురక్షిత్‌ 3డీ ల్యాపరోస్కోపిక్‌ సాంకేతికతను ఉపయోగించి 8 గంటల పాటు శ్రమించి ఆ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. అంతేకాదు 2019లో డాక్టర్‌ సురక్షిత్‌ గురువైన డాక్టర్‌ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి సాధించిన గిన్నిస్‌ రికార్డును బద్దులు కొట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు.

సేవాస్టార్‌..
డాక్టర్‌ సురక్షిత్‌ చెన్నైలోని అన్నా నగర్‌లో 2016లో ఇండిగో ఉమెన్స్‌ సెంటర్‌ను స్థాపించారు.  తన కెరీర్‌లో ఇప్పటివరకు 10,000కు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 40కి పైగా అవార్డులు అందుకున్నారు.  మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు శోభన్‌ బాబు పేరుతో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు.  టెడెక్స్‌ స్పీకర్, ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ డిజిటల్‌ విద్యావేత్త అయిన డాక్టర్‌ సురక్షిత్‌ బత్తినకు సెలబ్రిటీల స్థాయిలో 1.65లక్షలకు పైగా  ఇన్‌స్ట్రాగామ్‌ ఫాలోయర్స్‌ ఉండడం విశేషం.  ఆయన శాస్త్రీయ విధానాలను సలహాలను వ్యాప్తి చేస్తున్నారు. ‘భారతదేశ సంతానోత్పత్తి  రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఐవీఎఫ్‌ లాంటి కార్పొరేట్‌ సంస్కృతికి వ్యతిరేకం అయినప్పటికీ... వంధ్యత్వానికి మూల కారణాలకు చికిత్స చేయడం  సహజ గర్భధారణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేంగా కృషి చేస్తున్నాను‘ అని డాక్టర్‌ బత్తిన చెబుతున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)