అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు

Published on Tue, 09/09/2025 - 12:19

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశామా? దక్షిణాదితో పాటు హిందీలోనే రిలీజ్ చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. రూ.1000 కోట్ల కలెక్షన్ అందుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మార్క్‌ని తెలుగు చిత్రాలు ఇదివరకే అందుకోగా, 'కేజీఎఫ్'తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఈ ఫీట్ సాధించేసింది. కానీ తమిళ పరిశ్రమకు మాత్రం అది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.

గత నెలలో వచ్చిన 'కూలీ' కూడా ఈ మార్క్ అందుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. రిలీజ్‌కి ముందు ఆ రేంజ్ హైప్ ఏ‍ర్పడింది. కానీ కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి రూ.400-500 కోట్ల వసూళ్ల వరకు వచ్చి ఆగిపోయింది. అయితే తమిళ మూవీస్ అసలు రూ.1000 కోట్ల మార్క్ ఎందుకు చేరుకోలేకపోతున్నాయ్ అనే విషయమై హీరో శివకార్తికేయన్ ఇప్పుడు మాట్లాడాడు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: అల్లు కుటుంబానికి GHMC షాక్‌)

'తమిళ సినిమా ఆ నంబర్‌కి చేరువలో ఉంది. మరికొన్నేళ్లలో రూ.1000 కోట్ల కలెక్షన్ ఫీట్ సాధిస్తుందని నమ్మతున్నాను. చాలా తమిళ సినిమాలు ఈ మార్క్‌ని అందుకోలేకపోతున్నాయి. స్టోరీలో సత్తా లేకపోవడమో లేదా పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడం వల్లనే దీనికి కారణం. మూవీ క్వాలిటీ సంగతి పక్కనబెడితే టికెట్ రేట్లు కూడా తమిళనాడులో చాలా తక్కువ. బెంగళూరు, ముంబైలో ఉన్నట్లు ఇక్కడా ఉంటే 'జైలర్'కి రూ.800-1000 కోట్లు వచ్చి ఉండేవి. అలా అని టికెట్ రేట్లు పెంచమని నా ఉద్దేశం కాదు. మా సినిమాలు.. ఉత్తరాది ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాల్సిన అవసరముంది' అని శివకార్తికేయన్ అన్నాడు.

ఇతడు చెప్పిన దానిలో కొంత నిజముంది. బెంగళూరు, ముంబై సంగతి పక్కనబెడితే హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్‌లో టికెట్ రేటు రూ.250-300 ఉంటే.. అదే సంస్థకు చెందిన చెన్నై మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ.180 మాత్రమే. అలానే తమిళ సినిమాల్లో ఎక్కువగా ప్రాంతీయత అనే అంశం కనిపిస్తుంది. అందుకే కొన్ని చిత్రాలు తమిళనాడులో తప్పితే మరో చోట ఆడవు. ఓవరాల్ అప్పీల్ ఉన్న మూవీస్ వచ్చినప్పుడు బహుశా తమిళ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ అందుకోవచ్చేమో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)