రామ్‌చరణ్‌ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ

Published on Wed, 09/02/2026 - 23:51

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్‌ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినదే కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

తాజాగా ‘ఇరుముడి’ సూపర్‌ హిట్‌ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్‌లో చరణ్‌ నటిస్తారా? అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘చరణ్‌ మా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు ఆయనను క్యామియోగా తీసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు. ఈ ప్రచారం సోషల్‌ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పారు.

అయితే కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే చరణ్‌తో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని శివ నిర్వాణ తెలిపారు. ముందుగా స్టార్‌ను అనుకుని పాత్రను సృష్టించడం తన విధానం కాదని స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టింది. మాలలో ఉన్న ఓ వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ కథను చాలా సహజంగా అభివృద్ధి చేశాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా హిట్‌ అయిందనే కారణంతో వెంటనే ‘ఇరుముడి 2’ కథ రాయలేను. మరో సహజమైన కథా పాయింట్‌ దొరికితేనే ఇరుముడి సీక్వెల్‌పై ఆలోచిస్తానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.

'ఇరుముడి' సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. మూడో వారాంతంలోకి వచ్చినా 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ తన హవా చూపించేలానే కనిపిస్తున్నాడు.
 

Videos

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

నేనూ సీఎం అవుతా టైం వస్తే అన్నీ అవే వస్తాయి

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)