Breaking News

ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్‌ వద్ద సెంచరీ

Published on Sun, 08/24/2025 - 17:01

థియేటర్‌లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్‌ సేతుపతి- నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో నటించిన సార్‌ మేడమ్‌ మూవీ (Sir Madam Movie) కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో తలైవాన్‌ తలైవి పేరిట జూలకై 25న విడుదలైంది. తెలుగులో సార్‌ మేడమ్‌ పేరిట ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సెంచరీ క్లబ్‌లో మూవీ
బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సంపాదించుకున్న ఈ మూవీ ఆగస్టు 22న  అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సార్‌ మేడమ్‌ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సత్యజోతి ఫిలింస్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించింది.

సినిమా
సార్‌ మేడమ్‌ విషయానికి వస్తే.. యోగిబాబు, చెంబన్‌ వినోద్‌ జోస్‌, శరవణన్‌, కాళి వెంకట్‌, ఆర్కే సురేశ్‌, మైనా నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎమ్‌.సుకుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు. ప్రదీప్‌ రాఘవ్‌ ఎడిటర్‌గా పని చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే కొట్లాటల సమూహారమే సార్‌ మేడమ్‌ సినిమా కథ!

 

 

చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్‌, మా వాళ్లే..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)