Breaking News

అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత

Published on Sat, 12/13/2025 - 18:13

పాప్ సింగర్ స్మిత ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ 2000ల్లో మాత్రం 'మసక మసక చీకటిలో..' అనే ఆల్బమ్ సాంగ్‌తో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత పలు ఆల్బమ్ గీతాలు చేసింది. కాకపోతే రీసెంట్ టైంలో మాత్రం పెద్దగా బయట కనిపించట్లేదు. తాజాగా 'మసక మసక' అని సాగే కొత్త పాటతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయింది. హైదరాబాద్‌లో ఈ సాంగ్ లాంచ్.. శనివారం సాయంత్రం జరిగింది.

(ఇదీ చదవండి: కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్‌)

ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్మిత.. నటిగా ఎందుకు సినిమాలు చేయడం మానేశానో మరోసారి చెప్పుకొచ్చింది. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. 'గాయనిగా నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వెంకటేశ్ 'మల్లీశ్వరి'లో ఓ పాత్రలో నటించాను. అది మిస్ ఫైర్ అయింది. మనకు చెప్పేది ఒకటి అక్కడ ఉండేది ఒకటి. ఎందుకులే అని అప్పటినుంచి సినిమాలు చేయడం మానేశాను' అని స్మిత చెప్పుకొచ్చింది.

స్మిత సింగర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ నటి, యాంకర్, బిజినెస్‌ఉమన్ గానూ పేరు తెచ్చుకుంది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతానికైతే మళ్లీ సింగర్‌గా రీఎంట్రీ ఇచ్చే బిజిలో ఉంది. ఈ సాంగ్ ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)