ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్

Published on Wed, 08/21/2024 - 11:22

మన దేశ గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా సరే ఈయన్ని చూసేందుకు అభిమానులు గట్టిగానే వస్తుంటారు. సోషల్ మీడియాలోనూ మోదీకి గుర్తింపు గట్టిగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈయన్ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దాటేసింది.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)

ప్రస్తుతం మన దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడి తర్వాత ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్లు, ప్రధాని మోదీకి దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మూడో స్థానికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వచ్చేసింది. 'స్త్రీ 2' సక్సెస్‌తో ఈమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు చేరింది. దీంతో మోదీని ఈమె అధిగమించినట్లయింది.

ట్విటర్‌లో మాత్రం 101.2 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇక శ్రద్ధా కపూర్ విషయానికొస్తే చాన్నాళ్ల నుంచి హిందీలో సినిమాలు చేస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌తోనూ 'సాహో' మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఆ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఏదేమైనా ఇప్పుడు 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది.

(ఇదీ చదవండి: ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. త్వరలో సన్యాసం)

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)