ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం
Breaking News
ఇప్పుడు ఫైట్... నెక్ట్స్ పాట
Published on Sun, 03/22/2026 - 05:19
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ సెట్‌లో జరుగుతోందని సమాచారం. రామ్‌చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
ఈ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్ కూడా ఉందని భోగట్టా. ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
Tags : 1