Breaking News

ఇన్ స్టా ఫాలోవర్స్ లేరని హీరోయిన్‌గా తీసేశారు: శివాత్మిక

Published on Fri, 06/20/2025 - 13:34

హీరోయిన్‌కి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అంటే యాక్టింగ్ టాలెంట్ లేదంటే ప్రేక్షకుల్ని రప్పించగలిగే గ్లామర్ ఉండాలి కదా అని చాలామంది అంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందని అంటోంది ఒకప్పటి హీరో రాజశేఖర్ కూతురు. హీరోయిన్‌గా ఐదు సినిమాలు చేసిన ఈమె.. తన ఛాన్సుల కష్టాల గురించి చెబుతోంది. ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని తనని సినిమా నుంచి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటోంది. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.

హీరో రాజశేఖర్-జీవిత దంపతులకు శివానీ, శివాత్మిక అని ఇద్దరు కూతుళ్లు. వీళ్లలో శివాత్మిక చిన్నమ్మాయి. 2019లో 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‪‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది మోస్తరుగా ఆడింది. కానీ తమిళంలో ఓ రెండు చిత్రాలు చేసింది. 2022లో మళ్లీ 'పంచతంత్రం', 2023లో 'రంగమార్తండ' మూవీస్‌లో నటించింది. తర్వాత కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.

(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక.. తనకు ఇన్ స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో కొన్ని సినిమాల నుంచి హీరోయిన్‌గా తీసేశారని, మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశమిచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఏ మేనేజర్ లేదా ఏజెంట్‌ని కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్‌ని పెంచుకోమంటున్నారని తన ఆవేదనని చెప్పుకొచ్చింది. అయితే తాను ఓ యాక్టర్  అని కంటెంట్ క్రియేట్ చేయడం తన పనికాదని చెప్పింది.

శివాత్మిక చెప్పడం అని కాదు గానీ రీసెంట్ టైంలో సోషల్ మీడియా నుంచి వచ్చి హీరోయిన్లు అయినవాళ్లు ఉన్నారు. వాళ్లలో వైష్ణవి చైత్యన ఒకరు. తొలుత ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈమె.. 'బేబి' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ తర్వాత వచ్చిన 'లవ్ మీ', 'జాక్' చిత్రాలతో ఘోరమైన ఫ్లాప్స్ అందుకుంది. రీసెంట్‌గా నిహారిక ఎన్ఎమ్ కూడా ఇలానే హీరోయిన్ అయింది. తొలుత తమిళంలో సినిమాలు చేసింది. ఇప్పుడు 'మిత్రమండలి' మూవీలో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)