Breaking News

ఏం చేయాలో అర్థం కాలేదు.. నడిరోడ్డుపై ఏడ్చేశాను : ‘దసరా’ విలన్‌

Published on Sun, 06/29/2025 - 16:56

కోలీవుడ్‌ నటుడు, ‘దసరా’ ఫేం షైన్‌ టామ్‌ చాకో(Shine Tom Chacko ) ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 6న తమిళనాడులోని ధర్మపురి జిల్లా  పాలకోట్టై సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అతని తండ్రి సీపీ చాకో మృతి చెందగా, తల్లి, సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఈ విషాద ఘటనపై చాకో స్పందించారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగిందని, తండ్రి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఎమోషనల్‌ అయ్యారు.

(చదవండి: రోజంతా కూర్చోబెట్టి.. అమ్మాయితో గుడి గంట కొట్టించారు : దిల్‌ రాజు)

‘ప్రమాదం జరిగిన సమయంలో నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నాను. మధ్యలో రెండు, మూడు సార్లు మెళకువ వచ్చింది. నాన్నని బిస్కెట్లు అడిగి తిని మళ్లీ నిద్రపోయాను. కాసేపటి తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి చిద్రలేచా. చూస్తే మా కారుకు ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందో తెలియదు. మేమంతా రోడ్డు మీద ఉన్నాం.అమ్మ షాక్‌కి గురైంది. ‘మనం ఎందుకు రోడ్డు మీద ఉన్నాం?’ , ఎక్కడికి వెళ్తున్నాం’ అని ప్రశ్నించింది. 

మా నాన్నను ఎన్నిసార్లు పిలిచిన పలకలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘దయచేసి ఎవరైనా సహాయం చేయండి. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ నడిరోడ్డుపైనే ఏడ్చేశాను. నా జీవితంలో తొలిసారి ఇలాంటి ఘటన ఎదుర్కొన్నాను’ అని చాకో చెప్పారు. ఈ ప్రమాదం తనకు 30 కుట్లు పడ్డాయని, తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)