Breaking News

ఇటువంటి పెళ్లి నేను చూడలేదు, రాజ్‌ ఎలాంటివాడంటే?

Published on Thu, 12/04/2025 - 11:38

హీరోయిన్‌ సమంత, ఫ్యాషన్‌ డిజైనర్‌, మోడల్‌ శిల్పారెడ్డి క్లోజ్‌ఫ్రెండ్స్‌ అని అందరికీ తెలుసు. శిల్పా లేకుండా సమంత ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. సామ్‌-రాజ్‌ పెళ్లిలోనూ శిల్పా స్నేహితురాలికి తోడుగా నిలబడింది. తాజాగా ఆ విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

ఈ మధ్యకాలంలో చూడలేదు
శిల్పా రెడ్డి మాట్లాడుతూ.. సమంత-రాజ్‌ల పెళ్లి ఎంత బాగా జరిగిందంటే ఈ మధ్యకాలంలో అటువంటి వివాహ వేడుకను నేను చూడనేలేదు. ఎంతో పవిత్రతతో ఈ తంతు సాగింది. సమంత-రాజ్‌ పూర్తిగా భిన్నస్వభావాలు కలిగినవారు. సామ్‌ చాలా ఎనర్జిటిక్‌, కొంటె అమ్మాయి, ఎక్కువ నవ్వుతూ ఉంటుంది. కానీ, రాజ్‌.. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతడితో ఫోన్‌లో మాట్లాడా.. అయితే, పెళ్లిలోనే ఫస్ట్‌ టైమ్‌ కలిశాను. 

ఏడ్చేశారు
ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు పెళ్లి ద్వారా ఒక్కటవడం చూస్తున్నప్పుడు చాలా మంచి అనుభూతి కలిగింది. ఈ పెళ్లికి ప్రతి కుటుంబం నుంచి పది మంది మాత్రమే హాజరయ్యారు. అది కూడా సామ్‌, రాజ్‌కు బాగా దగ్గరైన వ్యక్తులు మాత్రమే వచ్చారు. ఇండస్ట్రీ నుంచి దర్శకురాలు నందినీరెడ్డి మాత్రమే వచ్చారు. ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా, అందంగా ఈ వేడుక జరిగింది. అగ్ని ముందు పెళ్లి సూత్రాన్ని వధువు వేలికి, వరుడు వేలికి తగిలించే విధానాన్ని చూసినప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఏదో శక్తి ఉద్భవించినట్లు అనిపించింది. ఆ ఎనర్జీని ఫీలై ఏడుగురు మంది మహిళలు ఏడ్చేశారు. అంత పవిత్రంగా ఆ వేడుక జరిగింది.

సమంతతో నా అనుబంధం
సమంత (Samantha) నేను కలిశామంటే నవ్వుతూనే ఉంటాం. మాపై మేమే జోకులు వేసుకుంటాం. ఒకరినొకరు ఏడిపించుకుంటాం. నాదేదైనా తప్పుంటే నన్ను చాలా ర్యాగింగ్‌ చేస్తుంది. మా మధ్య ఎటువంటి హద్దులు ఉండవు. ఒకరినొరు టీజ్‌ చేసుకుంటాం, తిట్టుకుంటాం, అలుగుతాం కూడా! సమంత అనారోగ్యం బారినపడటం, విడాకులు, ట్రోలింగ్‌.. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగింది. తను గొప్ప ఫైటర్‌. అందుకే తనంటే చాలామందికి ఇష్టం అని శిల్పా రెడ్డి (Shilpa Reddy) చెప్పుకొచ్చింది.

చదవండి: రేణూ దేశాయ్‌కు పుట్టుకతోనే ఆ సమస్య

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)