Breaking News

'నటి ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. ఆమెనే చంపాలని చూసింది'

Published on Mon, 01/02/2023 - 15:35

బాలీవుడ్ బుల్లితెర నటి తునిషా శర్మ ఆత్మహత్యపై వివాదం మరింత ముదురుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె ప్రియుడు షీజాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే  ఈ ఘటనపై షీజాన్‌ ఖాన్ కుటుంబ సభ్యులు షాకింగ్ కామెంట్స్ చేశారు.  తునిషా శర్మకు ఆమె తల్లితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని అన్నారు. ఆమె తన సొంత కూతురినే గొంతు కోసి చంపేందుకు కూడా ప్రయత్నించిందని ఆరోపించారు. కాగా.. తునిషా డిసెంబర్ 24, 2022న తన షో 'అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్' సెట్స్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. 

సోమవారం మీడియాను ఉద్దేశించి షీజన్ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఆమె తల్లి తునీషా పట్ల వ్యవహరించిన తీరుతో తాము నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. అలాగే తునీషా మామగా చెప్పుకుంటున్న సంజీవ్ కౌశల్ కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదని షీజన్ తరపు న్యాయవాది వాదించారు.  అతను, తునీషా తల్లితో కలిసి నటి ఇష్టానికి వ్యతిరేకంగా పని చేయమని బలవంతం చేశాడని ఆరోపించారు. కౌశల్, తునీషా తల్లి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా అతను ప్రశ్నించాడు.  అలాగే తునీషా ఖర్చులన్నింటినీ కౌశల్ తానే భరిస్తున్నానని.. ఆమె వద్ద తిండికి కూడా సరిపడా డబ్బు లేదని చెప్పాడని అన్నారు. 

లాక్‌డౌన్ తర్వాత తునీషా తల్లి, కౌశల్ కలిసి ఆమెను చండీగఢ్ వెళ్లమని బలవంతం చేశారు. కానీ ఆమె నిరాకరించడంతో తునీషా మొబైల్ ఫోన్‌ను పగలగొట్టి, ఆమె గొంతు కోసి చంపడానికి కూడా ప్రయత్నించింది. తునీషా నటిస్తున్న షో డైరెక్టర్‌తో ఈ విషయాలను పంచుకుంది" అని షీజన్ న్యాయవాది పేర్కొన్నారు.

ఇస్లాం స్వీకరించమని బలవంతం చేయలేదు: షీజాన్ సోదరీమణులు

షీజాన్ కుటుంబం తునీషాను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసిందని తునీషా తల్లి చేసిన వాదనలను అతని సోదరీమణులు షఫాక్ నాజ్, ఫలక్ నాజ్ ఖండించారు. ఆమెను తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించామని పేర్కొన్నారు. తునీషా హిజాబ్‌లో ఉన్న ఫోటో ఆమె 'అలీ బాబా: దస్తాన్-ఎ-కాబుల్' షో సెట్స్‌లో తీసిందని వారు స్పష్టం చేశారు.

'

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)