Breaking News

ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?

Published on Fri, 06/26/2026 - 16:29

ఓటీటీల్లోకి ఈ వారం బ్లాస్ట్, రాజా శివాజీ, అవతార్ 3 లాంటి సినిమాలు వచ్చేశాయి. వీటితో పాటు 'ద షీప్ డిటెక్టివ్స్' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ కూడా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉన్న ఈ సినిమాని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కు కాస్త కామెడీ జోడించి తీశారు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు)

కథేంటి?
జార్జ్(హ్యూ జాక్‌మన్) ఓ గొర్రెల కాపరి. డెన్‌బ్రూక్ అనే చిన్న పల్లెటూరిలో జీవిస్తుంటాడు. అయితే రాత్రి పడుకోవడానికి ముందు గొర్రెలకు తన దగ్గరుండే డిటెక్టివ్ నవలలు చదివి వినిపిస్తుంటాడు. అయితే ఆ గొర్రెలకు ఈ కథలన్నీ అర్థమవుతున్నాయనే సంగతి జార్జ్‌కి తెలియదు. ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి జార్జ్‌ని ఎవరో చంపేస్తారు. ఈ కేసుని ఓ పోలీస్ దర్యాప్తు చేస్తుంటాడు. మరోవైపు గొర్రెలన్నీ డిటెక్టివ్‌గా మారి తన కాపరిని ఎవరో చంపారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. చివరకు హంతకుడు దొరికాడా? లేదా? అసలు జార్జ్‌ని ఎవరు ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇ‍ప్పటివరకు మీరెన్ని మర్డర్ మిస్టర్ థ్రిల్లర్స్ చూసే ఉంటారు. వాటన్నింటిలోనూ పోలీసులు లేదా ప్రైవేట్ డిటెక్టివ్స్, చుట్టూ పక్కన ఉండే వాళ్లలో ఎవరో ఒకరు పరిష్కరించడం లాంటివి చూసుంటారు. కానీ ఇందులో మాత్రం గొర్రెలు.. ఓ హత్య కేసుని పరిష్కరించేందుకు చాలా సహాయపడతాయి. వినడానికి విచిత్రంగా ఉంది కదా! కానీ పెద్దగా హడావుడి లేకుండా సరదాగా మూవీ తీసేశారు.

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఏదేదో ట్విస్టులు ఊహించేసుకుంటాం కదా. ఇందులో హత్య చేసింది ఎవరు? అనే ట్విస్ట్ ఉంటుంది గానీ దానికంటే గొర్రెలు, మనుషుల్లా మాట్లాడుకోవడం.. తమ కాపరి ఇప్పటివరకు చదివి వినిపించిన డిటెక్టివ్ పుస్తకాల్లోని స్టోరీల ఆధారంగా ఈ కేసుని ఛేదించేందుకు ప్రయత్నం చేయడం లాంటివి ఫన్నీగా ఉంటాయి. గ్రాఫిక్స్ కూడా చాలా సహజంగా ఉంది.

అలానే అప్పటివరకు ఊరి చివర గడ్డి తిని బతికే గొర్రెలు.. మనుషులు ఉండే ప్రపంచంలోకి వచ్చి గందరగోళానికి గురవడం లాంటివి కూడా ఫన్నీగా చూపించారు. జార్జ్‌తో పాటు అదే ఊరిలోని మరో గొర్రెల కాపరి, కసాయి వాడు, ఓ హోటల్ యజమాని, పోలీసోడు, ఓ న్యూస్ రిపోర్టర్, జార్జ్ కూతురు.. ఇలా చాలా పాత్రలపై అనుమానం వచ్చేలా దర్శకుడు స్టోరీని నడిపించాడు. కానీ క్లైమాక్స్‌లో హంతకుడు/హంతకురాలు ఎవరనేది పెద్దగా హడావుడి లేకుండా చూపించి సినిమా ముగించాడు.

సినిమాలోని నటించిన నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలైతే కాదు. కానీ ఆయా పాత్రలకు సెట్ ‍అయిపోయారు. తెలుగు డబ్బింగ్, గొర్రెల గ్రాఫిక్స్ లాంటివి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుదిరితే పిల్లలకు కూడా చూపించండి. వాళ్లు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దాదాపు 100 నిమిషాలుండే ఈ మూవీ ఇలా మొదలుపెడితే అలా అయిపోతుంది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)