Breaking News

దేశాన్ని కుదిపేసిన సంఘటన.. ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్‌గా

Published on Mon, 01/29/2024 - 14:02

నిజ జీవిత కథలతో సినిమాలు రావడం ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు మాత్రం వాటిని వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీస్ తరహాలో తీస్తున్నారు. ఇక దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అయితే ప్రధానంగా ఇలాంటి వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి దేశంలోనే చర్చనీయాంశంగా మారిన కేసులపై సిరీస్‌లు తీస్తోంది. ఇప్పుడు కూడా అలానే అప్పట్లో సంచలనం సృష్టించిన 'షీనా బోరా కేసు' నేపథ్యంగా తీసిన సిరీస్‌ని స్ట్రీమింగ్‌కి రెడీ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

ఏంటీ 'షీనా బోరా' కేసు?
2012లో షీనా బోరాని హత్య జరిగింది. అయితే ఇది మూడేళ్ల తర్వాత బయటపడింది. ఇంద్రాణీ ముఖార్జియా అనే మహిళ కారు డ్రైవర్.. ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా షీనా బోరా హత్య గురించి సంచలన నిజాల‍్ని ఇతడు వెల్లడించాడు. కూతురు షీనాని.. సొంత తల్లి ఇంద్రాణీనే గొంతు నులిమి చంపేసిందని చెప్పాడు. దీంతో ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది.

దర్యాప్తులో బయటపడిన వివారల ప్రకారం.. తన భర్త నుంచి ఇంద్రాణీ విడిపోయిన తర్వాత కూతురు షీనా, కొడుకు మైకేల్‌ని గౌహతిలో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గర ఉంచేసింది. కొన్నాళ్ల తర్వాత సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని ఇంద్రాణీ పెళ్లి చేసుకుంది. ఇతడితో కూడా ఇంద్రాణీ ఎక్కువ రోజులు సంసారం చేయలేక విడిపోయింది. ఆ తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖార్జియాని ఇంద్రాణీ వివాహమాడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే పీటర్- అతడి తొలి భార్యకు పుట్టిన కొడుకుని షీనా ప్రేమించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)

ఇక తల్లి పీటర్ ని పెళ్లి చేసుకోవడంతో ఆ కుర్రాడు.. షీనాకు అన్న వరస అవుతాడు. ఈ విషయమై ఇంద్రాణీ-షీనా మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. సొంత కూతురినే చంపాలని ప్లాన్ చేసింది. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కూతురిని హతమార్చింది. మృతదేహాన్ని చత్తీస్‌ఘడ్‌లోని అటవీ ప్రాంతంలో కాల్చేసింది. 2012లో హత్య జరగ్గా 2015లో పోలీసులకు విషయం తెలిసి ఇంద్రాణీతో పాటు రెండో భర్త సంజీవ్, మూడో భర్త పీటర్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు.  జైల్లో ఉన్న టైంలోనే అంటే 2019లో ఇంద్రాణీ తన భర్త మూడో భర్త పీటర్‌కి కూడా విడాకులు ఇచ్చేసింది. 

ఇదే స్టోరీతో 'ద ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్' పేరుతో డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తీశారు. ఫిబ్రవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి సిరీస్‌లో తెలిసిన విషయాలతో పాటు కొత్తవి ఏమేనా ఉంటాయా? లేదా? అనేది చూడాలి.

(ఇదీ చదవండి: 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)